తెలంగాణ

telangana

ETV Bharat / business

ఖర్చుల నియంత్రణ కోసం ఓ బ్యాంకు ఖాతా!

Bank account for expenses: ఉద్యోగులకు నెలనెలా జీతం శాలరీ ఖాతాలో జమ అవుతుంది. అందులో నుంచే అన్ని ఖర్చులూ, రుణ వాయిదాలూ వెళ్లేలా  ఏర్పాట్లు చేసుకుంటారు. దీనికి బదులుగా ఖర్చుల కోసం రెండో బ్యాంకు ఖాతాను ఉపయోగించే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఖర్చుల మీద నియంత్రణ పెరుగుతుంది.

Banking
ఖర్చుల నియంత్రణకు ఓ బ్యాంకు ఖాతా

By

Published : Mar 4, 2022, 12:40 PM IST

Bank account for expenses: దాయం రాగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఒకే ఖాతాలో ఆదాయం, వ్యయాలన్నీ నమోదైతే.. ఆర్థిక క్రమశిక్షణ సరిగా ఉండదు. ఖాతాలో డబ్బు కనిపిస్తుంది కాబట్టి, ఉన్నదంతా ఖర్చు చేయడానికే అన్నట్లుగా భావిస్తుంటాం. దీనికి బదులుగా వేతనం రాగానే ఖర్చుల కోసం కేటాయించిన ఖాతాలోకి డబ్బును బదిలీ చేయాలి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ తదితరాల రాకతో ఇప్పుడు బిల్లుల చెల్లింపు ఎంతో సులభమయ్యింది. కాబట్టి, బీమా ప్రీమియాలు, నిత్యావసర వ్యయాలన్నింటినీ చెల్లించేందుకు వేతనం ఖాతాను కాకుండా.. మరో పొదుపు ఖాతాను వినియోగించడం అలవాటు చేసుకోండి.

  • ఒకే ఖాతా నుంచి ఖర్చుల కోసం డబ్బు వెళ్తున్నప్పుడు వాటిని పరిశీలించడం చాలా తేలికవుతుంది. ముందుగా పెట్టుబడి, రుణాలకు ఈఎంఐ పోను.. ఖర్చుల కోసం నెలవారీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవాలి. ఆ మేరకే ఖర్చు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. మీ వేతన ఖాతా నుంచి అవసరమైన మేరకే ఈ ఖర్చుల ఖాతాకు బదిలీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేతన ఖాతాలో మిగిలిన డబ్బులను తీయొద్దు. ఇలా చేయడం వల్ల నెలనెలా మీ పొదుపు మొత్తం పెరుగుతుంది. అత్యవసరాల్లో మాత్రమే ఈ సొమ్మును వాడాలి.
  • ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు వాడటం వల్ల రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లాంటివి వస్తుంటాయి. వేతన ఖాతా, పొదుపు ఖాతాలో దేనికి ఈ రివార్డులు ఎక్కువగా ఉన్నాయో చూడండి. వేతన ఖాతా డెబిట్‌ కార్డుతో చేసే చెల్లింపులకు ప్రయోజనాలు అధికంగా ఉంటే ఆ మేరకు ఈ ఖాతా నుంచే చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ఖర్చుల ఖాతాకు మళ్లించాలి.
  • చాలా బ్యాంకులు వేతన ఖాతా, పొదుపు ఖాతాలపై ఒకే విధంగా వడ్డీని అందిస్తాయి. కొన్ని బ్యాంకులు వేతన ఖాతాకు తక్కువ వడ్డీనిస్తాయి. ఇప్పుడు కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలపై కాస్త అధిక వడ్డీని ఇస్తున్నాయి. ఇలాంటి బ్యాంకులను ఎంచుకొని, ఖర్చుల ఖాతాను తెరవాలి. నెలాఖరుకు అందులో మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు మళ్లించే ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఫ్లెక్సీ డిపాజిట్‌ ఖాతాలు ఉపయోగపడతాయి.

ABOUT THE AUTHOR

...view details