తెలంగాణ

telangana

ETV Bharat / business

Bajaj Dominar 250: డామినార్ బైక్​ ధర భారీ తగ్గింపు! - బజాజ్ డామినార్ అప్​డేట్స్​

గత కొన్ని రోజులుగా ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలు పెంచుతుంటే.. బజాజ్​ ఆటో మాత్రం డామినార్​ 250 బైక్(Bajaj Dominar 250)​ ధరను భారీగా తగ్గించింది. తగ్గిన ధరలను వెబ్​సైట్లో అప్​డేట్​ కూడా చేసింది. ధర ఎంత తగ్గింది. ప్రస్తుత ధర ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Bajaj Dominar price Slashed
బజాజ్ డామినార్ ధర కోత

By

Published : Jul 7, 2021, 3:09 PM IST

ముడి సరకు వ్యయాల పెరుగుదలతో ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలు క్రమంగా పెంచుతున్నాయి. అయితే దేశీయ బైక్​ల తయారీ కంపెనీ 'బజాజ్ ఆటో'(Bajaj Auto) మాత్రం ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. డామినార్​ 250 బైక్​ ధరను రూ.16.5 వేల వరకు తగ్గించింది. దీనితో ఈ బైక్​ ధర (హైదరాబాద్ ఎక్స్​షోరూం) రూ.1.54 లక్షలకు దిగొచ్చింది.

తాజా నిర్ణయంతో డామినార్​ 400 బైక్​తో పోలిస్తే.. డామినార్​ 250 బైక్​ ధర దాదాపు రూ.60 వేలు తక్కువైంది.

డామినార్​ 250 బైక్​ 2020లో మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దీని ప్రారంభ ధర రూ.1.60 లక్షలుగా ఉండగా.. ఒకానొక దశలో రూ.1.71 లక్షల పైకి కూడా చేరింది. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు గానూ.. బైక్​ ధరలను సవరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారీగా కోత విధించినట్లు తెలుస్తోంది.

ఫీచర్లు ఇలా..

  • 248 సీసీ సింగిల్​ సిలిండర్, 4 వాల్వ్స్​ లిక్విడ్​ కూల్డ్ ఇంజిన్​
  • 27 పీఎస్​ పవర్​ విడుదల చేసే సామర్థ్యం
  • 6 గేర్​ ట్రాన్స్ మిషన్​
  • గరిష్ఠ వేగం గంటకు 132 కిలోమీటర్లు
  • రెండు చక్రాలకు డిస్క్​ బ్రేక్​ సౌకర్యం
  • డిజిటల్ స్పీడో మీటర్​ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details