డొమినార్ స్పోర్ట్స్ టూరర్ విభాగంలో డొమినార్ 400 బైక్‌ను(Bajaj Dominar 400) బజాజ్ ఆటో సోమవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2,16,648(Bajaj dominar 400 price) (ఎక్స్-షోరూమ్, దిల్లీ). 373.8 సీసీ డీఓహెచ్సీ ఎఫ్ఐ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 40 పీఎస్ పవర్ దీని సొంతమని బజాజ్ ఆటో తెలిపింది. ఈ బైకులు ప్రస్తుతం అన్ని బజాజ్ ఆటో షోరూమ్‌లలో అరోరా గ్రీన్, చార్కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
'డొమినార్ బ్రాండ్ తనకంటూ ఓ బలమైన ఫాలోయింగ్‌ను సృష్టించుకోగలిగింది. సుదూర పర్యటకులు దీన్ని బాగా ఇష్టపడి ఎంపిక చేసుకునే విధంగా ఉంది' అని బజాజ్ ఆటో మార్కెంటిగ్ హెడ్ నారాయణ సుందరరామన్ అభిప్రాయపడ్డారు.
ఫీచర్లు..
- 373.8 సీసీ డీఓహెచ్సీ ఎఫ్ఐ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
- 40 పీఎస్ పవర్ విడుదల చేసే సామర్థ్యం
- 6 గేర్ ట్రాన్స్ మిషన్
- రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్
- డిజిటల్ స్పీడో మీటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.