తెలంగాణ

telangana

ETV Bharat / business

రోజుకు సగటున 7 గంటలు స్మార్ట్​ఫోన్​తోనే..

లాక్​డౌన్​ తర్వాత స్మార్ట్​ఫోన్​లో గడిపే సమయం బాగా పెరిగింది. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కోసం చాలా మంది భారతీయులు.. ఎక్కువ సమయం స్మార్ట్​ ఫోన్లో వెచ్చిస్తున్నట్లు తేలింది. ఈ ఏడాదిలో సగటు స్మార్ట్​ఫోన్​ వినియోగం 25 శాతం పెరిగి, దాదాపు 7 గంటలకు చేరింది.

Average time spent on smartphone up 25% to 6.9 hrs amid pandemic: Vivo-CMR report
స్మార్ట్​ఫోన్​తో రోజుకు సగటున 6.9 గంటలు

By

Published : Dec 13, 2020, 9:38 PM IST

మహమ్మారి అనంతరం.. భారతీయుల సగటు స్మార్ట్​ఫోన్​ వినియోగం 25 శాతంపెరిగి దాదాపు 7 గంటలకు చేరిందని ఓ నివేదిక తెలిపింది. ఆన్​లైన్ క్లాసులు, వర్క్​ ఫ్రం హోమ్​ వంటి అవసరాల వల్ల స్మార్ట్​ఫోన్​ వాడకం పెరిగిందని వెల్లడించింది. 'స్మార్ట్​ ఫోన్లు, మానవ సంబంధాలపై వాటి ప్రభావం-2020' పేరుతో వివో ఇండియా, సీఎమ్​ఆర్​ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 2019లో సగటు వినియోగం 4.9 గంటలుగా ఉండగా.. 2020 మార్చిలో 11 శాతం పెరిగి 5.5 గంటలకు చేరింది. ఏప్రిల్​ తర్వాత ఇది సగటున 25 శాతం పెరిగి 6.9 గంటలకు చేరింది.
  • లాక్​డౌన్​ తర్వాత వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కోసం భారతీయులు ఎక్కువ సమయం స్మార్ట్​ఫోన్లలో గడుపుతున్నారు. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కోసం స్మార్ట్​ ఫోన్లు వాడే సమయం 75 శాతం పెరిగింది.
  • ఫోన్​ కాలింగ్​ కోసం వెచ్చించే సమయం 63 శాతం పెరిగింది.
  • ఓటీటీల కోసం గడిపే సమయం 59 శాతం పెరిగింది.
  • సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయం 55శాతం పెరిగింది.
  • ఆన్​లైన్ గేమింగ్​ కోసం 45 శాతం ఎక్కువగా గడుపుతున్నారు.
  • అహ్మదాబాద్​, బెంగళూరు, పుణె, హైదరాబాద్​ వంటి మెట్రో నగరాలు సహా 8 నగరాల్లోని 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల వారిపై ఈ అధ్యయనం చేపట్టారు.

అయితే ఈ లాక్​డౌన్​ తర్వాత కుటుంబాలతో గడిపే సమయం 26 శాతం పెరిగిందని నివేదిక చెబుతోంది. కానీ, చాలా మంది తమకిష్టమైన వారితో గడిపే సమయంలో స్మార్ట్​ఫోన్​ వినియోగించడం వల్ల అది నాణ్యతపై ప్రభావం పడుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు అంగీకరించారు.

"లాక్​డౌన్​లో చాలా మంది ఫోన్​ వినియోగించారు. ఇలా ఎక్కువగా స్మార్ట్​ ఫోన్​ వినియోగం వల్ల జరిగే నష్టాలు తెలుసుకునేందుకే మేం ఈ సర్వే చేశాం. స్మార్ట్​ ఫోన్ అందరికీ ఓ వ్యసనంలా మారుతోంది. 84 శాతం మంది ప్రతి 15 నిమిషాలకొకసారి తమ స్మార్ట్​ ఫోన్​ను చూసుకుంటున్నారు. 46 శాతం మంది గంటసమయంలో కనీసం 5 సార్లు తమ ఫోన్​ కోసం వెతుకుతున్నారు. ​"

-- వివో ఇండియా డైరెక్టర్​, నిపున్​ మర్యా

74 శాతం మంది తాము స్మార్ట్​ఫోన్ వినియోగించడాన్ని ఆపేస్తే అసహనానికి లోనవుతున్నట్లు సర్వే తెలిపింది. స్మార్ట్​ఫోన్​ వాడకం పెరిగితే.. తమ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని 70 శాతం మంది అంగీకరించారని తెలిపింది.

ఇదీ చూడండి:కొత్తదైనా... పాతదైనా... కారు కారే కదా!

ABOUT THE AUTHOR

...view details