బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఏదో ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటాయి. అందుకే, అవి ఈ ఖాతాల్లో నెలవారీ సగటు నిల్వ ఉండాలనే నిబంధనను విధిస్తుంటాయి. ఈ నిల్వ వల్ల బ్యాంకులకు చేతిలో కొంత నగదు కనిపిస్తుంటుంది. రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు ఇదే కీలకం కూడా. సాధారణంగా బ్యాంకులు, ఆ శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ నెలవారీ సగటు నిల్వ రూ.1,000 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది. (వేతన ఖాతాలు ప్రత్యేకం) ఈ సగటు నిల్వను ఎలా లెక్కిస్తారు అనేది కూడా చాలామందికి సందేహమే..
ఒక నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజూ చివర ఉన్న నిల్వను లెక్కలోకి తీసుకుంటారు. ఈ మొత్తాన్ని అంతా కూడుతారు. ఇలా వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో ఉన్న రోజులతో భాగించినప్పుడు నెలవారీ కనీస నిల్వ ఎంత అన్నది తెలుస్తుంది. బ్యాంకు పనిదినాలతో ఇక్కడ సంబంధం ఉండదు.
దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..
మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకులో నెలవారీ సగటు నిల్వ రూ.5,000 ఉండాలని నిబంధన ఉందనుకుందాం. నెలలో మొదటి రోజు బ్యాంకు ఖాతాలో రూ.7,000 ఉన్నాయి. ఐదో తేదీన రూ.3,000 తీసుకున్నారు. 20నాడు రూ.10,000 జమ చేశారు.. ఇప్పుడు..దీ 1-4వ తేదీ వరకూ రూ.7,000×4=రూ.28,000
* 5-19వ తేదీ వరకూ రూ.4,000×15=రూ.60,000
* 20-31వ తేదీ వరకూ రూ.14,000×12= 1,68,000
నెలవారీ సగటు నిల్వ = రూ.28,000+రూ.60,000+రూ.1,68,000/31 (నెలలో 31 రోజులు ఉన్నాయని అనుకుందాం) = 2,56,000/31= రూ.8,258.06