తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్: దేశంలో నిలిచిన వాహన ఉత్పత్తి

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహన ఉత్పతి నిలిపివేశాయి వాహన తయారీ సంస్థలు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.

auto production halt
కార్లఉత్పత్తికి కరోనా గండం

By

Published : Mar 24, 2020, 1:56 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని వాహన కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కొనుగోలుదార్లు, ఉద్యోగులు, సరఫరాదార్ల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.

టీవీఎస్‌ మోటార్‌: భారత్‌, ఇండోనేసియాలలో ప్రభుత్వాల నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు ఉత్పత్తి నిలిపేస్తున్నాం. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా అనుమతులిచ్చాం. ఉద్యోగాలు, వేతనాలు పరిరక్షిస్తామని హామీ ఇచ్చాం.

కియా మోటార్స్‌: తదుపరి ఆదేశాలిచ్చే వరకు అనంతపూర్‌ (ఆంధ్రప్రదేశ్‌)లోని తయారీ ప్లాంటు, కంపెనీ కార్యాలయాలు మూసి ఉంటాయి.

బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా: విక్రయాలు, ఆర్థిక సేవల విభాగాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే వీలు ఈ నెల 31 వరకు కల్పించాం. చెన్నై ప్లాంటులో ఉత్పత్తి కూడా అప్పటివరకు నిలిపేశాం.

రెనో ఇండియా: 'చెన్నైలోని రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్లాంటులో ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపేశాం. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం’ - ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి

హ్యుందాయ్‌, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉత్పత్తి నిలిపేస్తున్నాం.

జనరల్‌ మోటార్స్‌: ఈనెల 31 వరకు ఉత్పత్తి ఆపేస్తున్నాం.

ఇదీ చూడండి:తగ్గనున్న అమెజాన్ ప్రైమ్ వీడియో క్వాలిటీ!

ABOUT THE AUTHOR

...view details