దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) బుధవారం ఆవిష్కరించింది. ప్యాసింజర్ వాహన విభాగంలో టాటా మోటార్స్ విడుదల చేసిన రెండో విద్యుత్ వేరియంట్ ఇది. నెక్సాన్ మోడల్ విద్యుత్ వేరియంట్ ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఈవీ.
ఎంపిక చేసిన డీలర్ల ద్వారా రూ.21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బుక్ చేసుకున్న వారికి ఆగస్టు 31 నుంచి డెలివరీ చేసే అవకాశాలున్నాయి.
టిగోర్ ఈవీ ఫీచర్లు..
- 26 కిలో వాట్స్ లీథియం అయాన్ బ్యాటరీ
- 55కిలో వాట్స్ పవర్‌ను, 170 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేయగలదు
- 0-60 కిలో మీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే సామర్థ్యం
- ఎనిమిదేళ్లు/ 1,60,000 కిలోమీటర్లు పూర్తయ్యే వరకు బ్యాటరీ, మోటార్‌కు వారంటీ
- సౌకర్యవంతమైన సీటింగ్ కెపాసిటీ
- ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకునే వీలున్న CCS2 ఛార్జింగ్ ప్రొటోకాల్
- ఎక్కడైనా 15A ప్లగ్ పాయింట్ ద్వారా ఫాస్ట్, నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్
- రిమోట్ కమాండ్స్, రిమోట్ డయాగ్నోసిస్, మొబైల్ ఫోన్ ద్వారా కార్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునే సదుపాయం సహా 30కిపైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి.
హోండా అమేజ్ కొత్త వేరియంట్..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా.. కాంపాక్ట్ సెడాన్ విభాగంలోని అమేజ్ మోడల్ అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది.
ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.6.32 లక్షలుగా నిర్ణయించింది. గరిష్ఠ ధర రూ.11.15 లక్షలుగా ఉంచింది.
1.2 లీటర్ ఇంజిన్‌తో పెట్రోల్ వేరియంట్, 1.5 లీటర్ వవర్ట్రైన్ సదుపాయంతో డీజిల్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు హోండా పేర్కొంది.
కారు విశేషాలు..
'పెట్రోల్ మోడల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 18.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. సీవీటీ వేరియంట్ మైలేజీ 18.3 కిలోమీటర్లు.