తెలంగాణ

telangana

ETV Bharat / business

'కొవాక్స్‌'తో కలిసి తయారీ: అరబిందో - అరబిందో ఫార్మా వార్తలు

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధికి అమెరికన్​ కంపెనీ కొవాక్స్​తో.. భారత్​కు చెందిన ప్రముఖ అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. అరబిందో ఫార్మా.. భారత్​ సహా యునిసెఫ్​కూ ఈ టీకా పంపిణీ చేయనుంది.

Aurobindo Pharma signs pact with Covaxx for COVID-19 vaccine
'కొవాక్స్‌'తో కలిసి తయారీ: అరబిందో

By

Published : Dec 25, 2020, 6:32 AM IST

కొవిడ్‌-19 టీకా తయారీకి అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యునైటెడ్‌ బయోమెడికల్‌ ఇంక్‌.. అనే సంస్థకు సబ్సిడరీ అయిన కొవాక్స్‌ తో హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కొవాక్స్‌కు చెందిన మొదటి మల్టీటోప్‌ పెప్టెడ్‌- ఆధారిత కొవిడ్‌-19 టీకా, యూవీ-612 ను అరబిందో ఫార్మా అభివృద్ధి చేస్తుంది. టీకా తయారు చేసి మనదేశంలో, యునిసెఫ్‌(యునైడెట్‌ నేషన్స్‌ అండ్​ ఇంటర్నేషనల్​ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌)కు సరఫరా చేస్తుంది. కొవాక్స్‌ టీకాపై ప్రస్తుతం అమెరికాలో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికంలో అమెరికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో నిర్వహించాలని ఈ సంస్థ భావిస్తోంది.

కొవాక్స్‌తో ఒప్పందం ప్రకారం కొవిడ్‌-19 వ్యాక్సిన్​ అభివృద్ధి చేసి హైదరాబాద్‌లోని తమ యూనిట్లో తయారు చేస్తామని అరబిందో ఫార్మా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీకి టీకా తయారీ కోసం 22కోట్ల డోసుల వార్షిక సామర్థ్యం ఉంది. వచ్చే జూన్‌ నాటికి ఈ సామర్థ్యాన్ని 48 కోట్ల డోసులకు పెంచుకోనుంది. కొవాక్స్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించడంపై అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ సంతోషం వెలిబుచ్చారు.

కొవిడ్‌-19 టీకాను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలంటే, బలమైన ప్రాంతీయ భాగస్వామ్యాలు అవసరమని కొవాక్స్‌ వ్యవస్థాపకుడు- సీఈఓ మీ మీ హు వివరించారు. ఈ దిశగా చూస్తే అరబిందో ఫార్మా తమకు సరైన భాగస్వామిగా అభివర్ణించారు. బ్రెజిల్‌, ఈక్వడార్‌, పెరూ.. తదితర దేశాలకు 14 కోట్ల డోసుల టీకా సరఫరా చేయడానికి ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గత నెలలో వెల్లడించింది కొవాక్స్‌.

ఇదీ చదవండి:'కొవాగ్జిన్‌ అభివృద్ధికి రూ.500 కోట్లు'

ABOUT THE AUTHOR

...view details