జర్మనీ విలాస కార్ల సంస్థ ఆడి రెండు కొత్త విద్యుత్ సూపర్ కార్లు(Audi Electric Car India) ఇ-ట్రాన్ జీటీ, ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ జీటీలను భారత విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.1.79 కోట్లు, రూ.2.04 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇ-ట్రాన్ జీటీ 390 కిలో వాట్‌ల శక్తిని ఇస్తుందని, 100 కి.మీ. వేగాన్ని 4.5 సెకన్లలో అందుకుంటుందని, 475 కిలోవాట్‌ల ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఇదే వేగాన్ని 3.3 సెకన్లలో చేరుకుంటుందని ఆడి(Audi Electric Car India) తెలిపింది.
Audi Electric Car: ఆడి నుంచి రెండు విద్యుత్ సూపర్‌కార్లు - ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ ధర
రెండు కొత్త విద్యుత్ సూపర్ కార్లు ఇ-ట్రాన్ జీటీ, ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ జీటీలను ఆడి సంస్థ(Audi Electric Car India) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.1.79 కోట్లు, రూ.2.04 కోట్లుగా నిర్ణయించింది.
![Audi Electric Car: ఆడి నుంచి రెండు విద్యుత్ సూపర్‌కార్లు Audi Electric Car India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13144272-thumbnail-3x2-audi.jpg)
ఒకసారి ఛార్జింగ్‌తో ఇ-ట్రాన్ జీటీ 401-481 కి.మీలు, ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ జీటీ 388- 500 కి.మీ వరకు ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్లు 5 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి దాదాపు 22 నిమిషాలు పడుతుందని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో మొదటి విద్యుత్ సూపర్ కారును విడుదల చేశామని, జులై నుంచి చూస్తే ఇవి నాలుగు, అయిదో విద్యుత్ మోడళ్లని సంస్థ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ భారత్‌లో ఇ-ట్రాన్ 50, 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55 విద్యుత్ కార్లను విక్రయిస్తోంది.
ఇదీ చూడండి:అక్టోబరు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్