Atm Transaction Charges: ఏటీఎం నుంచి పరిమితికి మించి లావాదేవీలు జరిపితే వినియోగదారులకు ఇకనుంచి అధిక భారం పడనుంది. పరిమితి తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు జనవరి 1 నుంచి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. నగదు, నగదు రహిత లావాదేవీలకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ మేరకు పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకు రూ.20 వసూలు చేశారు.
ATM Transaction New Rules: ప్రతి వినియోగదారుడు ప్రతినెల ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో మరో మూడు, నాన్- మెట్రో నగరాల్లో ఐదు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.
వడ్డీరేట్లు యథాతథం..
Interest Rates On Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను నాల్గవ త్రైమాసికానికి(2021-2022) యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ స్కీంల వడ్డీ రేట్లు ఎప్పటిలాగే 7.1 శాతం, 6.8 శాతం ఉండనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. నాల్గవ త్రైమాసికం 2022 జనవరి 1నుంచి 2022 మార్చి 31 వరకు ఉంటుంది.
ఇదీ చదవండి:Financial Changes 2022: ఈ ఆర్థిక మార్పులకు సిద్ధమవ్వండి!