తెలంగాణ

telangana

ETV Bharat / business

విమాన సంస్థలకు షాక్​.. ఏటీఎఫ్ ధరలు పైపైకి - ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు

గడిచిన 30 రోజుల్లో ఏటీఎఫ్​ ధరలు మూడోసారి పెరిగాయి. దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర బుధవారం 7.5 శాతం పెరిగి.. రూ.41,992.81కి చేరింది. రాయితీ లేని వంట గ్యాస్ ధరలను ఫ్లాట్​గా ఉంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

atf price hike
పెరిగి ఏటీఎఫ్ ధరలు

By

Published : Jul 1, 2020, 10:56 AM IST

విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్​) ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కిలో లీటర్​ ఏటీఫ్​ ధర రూ.2,922.94 (7.5 శాతం) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో దిల్లీలో కిలో లీటర్​ ఏటీఎఫ్​ ధర రూ.41,992.81 వద్దకు చేరింది.

గడచిన 30 రోజుల్లో ఏటీఎఫ్ ధరలు పెరగటం ఇది మూడో సారి. ఇప్పటికే కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమాన సంస్థలకు పెరిగిన ఏటీఎఫ్ ధరలు మరింత భారం కానున్నాయి.

ఏటీఎఫ్​ ధరలు ప్రతి నెల 1, 16 తేదీల్లో సవరిస్తుంటాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా జూన్​ 1న అత్యధికంగా 56.6 శాతం, జూన్​ 16న 16.3 శాతం ధరలు పెంచాయి.

మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజూ మార్పులు చేయలేదు చమురు మార్కెటింగ్ సంస్థలు.

స్వల్పంగా పెరిగిన ఎల్​పీజీ ధర..

రాయితీలేని వంటగ్యాస్​ (ఎల్​పీజీ) ధర కూడా దిల్లీలో రూ.1 పెరిగి రూ.594కు చేరింది. స్థానిక పన్నులు, వ్యాట్​లలో తేడా కారణంగా నాన్​సబ్సిడీ రూ.4 వరకు ధర పెరిగింది.

ఇదీ చూడండి:అమెజాన్‌ ఉద్యోగులకు రూ.3వేల కోట్ల బోనస్‌

ABOUT THE AUTHOR

...view details