రోల్స్ రాయిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును తయారు చేసింది. అదీ కేవలం ముగ్గురి కోసమే రూపొందించినట్లు సమాచారం. అందులో ఒక కారును పాప్ స్టార్ దంపతులు బెయోన్స్, జే జెడ్ ఒక కారును కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే.. అవన్నీ ఊహాగానాలేనని తేలింది. 'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్'గా పిలిచే ఆ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైనది. దీని ధర ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.202 కోట్లపైనే).
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారు ఈ కారు డిజైన్‌ను కస్టమర్ల సూచనల మేరకు రూపొందించినట్లు తెలిపారు రోల్స్ రాయిస్ మోటర్ కార్స్ సీఈఓ టోర్స్టెన్ ముల్లెర్ ఒట్వోస్. క్లయింట్లతో రోల్స్ రాయిస్ ఇంజినీర్లు పనిచేస్తూ.. వారికి కావాల్సిన ప్రత్యేక వాహనాలను రూపొందిస్తారని పేర్కొన్నారు.
కారు ప్రత్యేకతలు..
- రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారు వెనుకభాగం సీతాకోక చిలుక మాదిరిగా తెరుచుకుంటుంది. దాని నుంచి ఒక గొడుకు విచ్చుకుంటుంది. పిక్నిక్కు వెళ్లినప్పుడు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. అలాగే.. వెనకభాగంలోనే డబుల్ రిఫ్రిజిరేటర్ ఉంది. అది 6 డిగ్రీల వరకు చల్లబరుస్తుంది.
బటర్‌ఫ్లై మాదిరిగా తెరుచుకునే వెనక భాగం - రోల్స్ రాయిస్ బోట్ టెయిల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ వాచ్‌ల తయారీ సంస్థ రూపొందించిన ప్రత్యేక గడియారం ఉంటుంది. అలాగే.. ఈ కారు కంపార్ట్మెంట్ను ఖరీదైన లెదర్, అల్యూమినియంతో రూపొందించారు.
- 15 స్పీకర్ల సౌండ్ సిస్టం ఈ కారులో మరో ప్రత్యేకత.
- ఈ కారు వివరాలు పూర్తిగా తెలియకపోయినప్పటికీ.. ఇందులో 6.757 లీటర్ల వీ12 ట్విన్ టర్బో ఇంజిన్ వినియోగించినట్లు సమాచారం.
ఈ విలాసవంతమైన, ఖరీదైన కారు బులెట్ ప్రూఫ్ అయుంటుందని భావిస్తున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఇది బులెట్ ప్రూఫ్ కాదు. ఈ కారు పైభాగం తెరుచుకునేలా ఉంటుంది.
ఇదీ చూడండి:కారు కొనకుండానే ఓనరు అవ్వండిలా...