డిస్నీ పార్కుల్లో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. దాదాపు 28 వేల మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు డిస్నీ ఇదివరకే ప్రకటించింది. ఇందులో పావుశాతం ఫ్లోరిడా డివిజన్ నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులకు సంస్థ రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమైంది.
డిసెంబర్ కన్నా ముందే ఫ్లోరిడాలోని 3,360 మంది నాన్-యూనియన్ ఉద్యోగులను తొలగించనున్నట్లు డిస్నీ సంస్థ తన లేఖలో పేర్కొంది. వాల్ట్ డిస్నీ వరల్డ్ సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూనియన్లతో సంస్థ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.