తెలంగాణ

telangana

ETV Bharat / business

సీరం ఇన్​స్టిట్యూట్​కు ఆస్ట్రాజెనెకా నోటీసులు - కరోనా టీకా డోసుల సరఫరా సీరం ఇన్​స్టిట్యూట్

టీకా డోసుల సరఫరాలో ఆలస్యంపై సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆస్ట్రాజెనెకా.. లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయంపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు.

AstraZeneca legal notice to SII over delays
సరఫరా జాప్యంపై సీరంకు ఆస్ట్రాజెనెకా నోటీసులు

By

Published : Apr 8, 2021, 3:18 PM IST

కరోనా టీకా డోసుల సరఫరాలో జాప్యంపై సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆస్ట్రాజెనెకా.. లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయాన్ని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. కాంట్రాక్టు వివాదంపై న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

భారత్​లో టీకా డోసులకు డిమాండ్ అత్యంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ ఉత్పత్తి సామర్థ్యాలపై ఒత్తిడి నెలకొందని పూనావాలా పేర్కొన్నారు. 'భారత్​లో సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మా ఒప్పంద బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నాం. డోసుల సరఫరాలో భారత్​కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలపై విదేశాలకు వివరణ ఇవ్వలేకపోతున్నాం' అని చెప్పారు. నోటీసులు వచ్చిన విషయం భారత ప్రభుత్వానికి తెలుసని అన్నారు.

142 దేశాలకు టీకా డోసులను పంపిణీ చేస్తున్నామని మార్చిలో ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. వీటి ఉత్పత్తి కోసం భారత్​లోని సీరం సంస్థతో ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:బడ్జెట్​ ధరలో హెచ్​పీ 'క్రోమ్‌బుక్‌ 11ఏ'

ABOUT THE AUTHOR

...view details