Ashneer Grover Resigns: ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే సహా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అశ్నీర్ గ్రోవర్ రాజీనామా చేశారు. నేడు(మంగళవారం) బోర్డు మీటింగ్ అజెండాను అందుకున్న నిమిషాల్లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి గ్రోవర్ వైదొలిగారు. అడ్వైజరీ కంపెనీ పీడబ్ల్యూసీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. వచ్చే బోర్డు సమావేశంలో తనపై చర్య తీసుకునే అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలుసుకున్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
Ashneer Grover Resigns causes
"అశ్నీర్ గ్రోవర్ ప్రవర్తనకు సంబంధించి పీడబ్ల్యూసీ నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అంశాన్ని రాబోయే బోర్డు అజెండాలో చేర్చారు. ఇది తెసుకున్న నిమిషాల్లోనే ఆయన ఎండీ పదవికి రాజీనామా చేశారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తప్పుకున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే హక్కు బోర్డుకు ఉంది" అని భారత్‌పే ఓ ప్రకటనలో తెలిపారు. గ్రోవర్ ప్రవర్తనపై పీడబ్ల్యూసీ నివేదిక అంశాలపై చర్చించేందుకు మంగళవారం బోర్డు సమావేశం జరగనుంది. కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
బలవంతంగా వైదొలుగుతున్నా..