మొబైల్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా త్వరలో 11 డిజిట్స్ మొబైల్ నంబర్ వస్తున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఖండించింది టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ-ట్రాయ్. అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 10 అంకెల నంబర్లే కొనసాగుతాయని తేల్చిచెప్పింది.
"ట్రాయ్ చేసిన 11 డిజిట్స్ మొబైల్ నంబర్ ప్రతిపాదన వల్ల భారీ సంఖ్యలో కొత్త నంబర్లు పుట్టకు వస్తాయి" అని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇలా చేయటం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగి టెలికాం రంగం అభివృద్ధి చెందుతుందని విశ్లేషించాయి. వీటిని తోసిపుచ్చింది ట్రాయ్.