తెలంగాణ

telangana

కృత్రిమ మేధ ఉద్యోగాలు పెరుగుతున్నాయ్‌

By

Published : Sep 6, 2020, 5:58 AM IST

దేశంలో గత కొన్నేళ్లుగా కృతిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో కృత్రిమ మేధకు సంబంధించిన ఉద్యోగాలు 2019, జూన్​ నుంచి 2020, జూన్​ మధ్య ఏకంగా 106 శాతం పెరిగినట్లు జాబ్​ సైట్​ ఇండీడ్​ నివేదించింది.

artificial intelligence
కృత్రిమ మేధ ఉద్యోగాలు పెరుగుతున్నాయ్‌

కృత్రిమ మేధ (ఏఐ)కు సంబంధించిన ఉద్యోగ అన్వేషణలు 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఏకంగా 106 శాతం పెరిగాయి. దేశంలో గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ నివేదికలో పేర్కొంది. ఇండీడ్‌ 2018 జూన్‌ నుంచి 2019 జూన్‌ మధ్య గణాంకాలతో వీటిని పోల్చిచూశారు.

ఇక కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చి- జులై మధ్య ఏఐకు సంబంధించిన ఉద్యోగాలను వెతికిన వారి సంఖ్య 20 శాతం పెరిగింది. కరోనా రాకతో మారిన పరిస్థితుల దృష్ట్యా వ్యాపారాలను కొనసాగించడానికి కృత్రిమ మేధకు సంబంధించిన టెక్నాలజీలను పరిశ్రమలు అందిపుచ్చుకోవడానికి మొగ్గుచూపుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో పనులు ఆటోమేషన్‌తో పూర్తికావడం వల్ల.. నైపుణ్యం కలిగిన వారి అవసరం కూడా పెరిగిందని ఇండీడ్‌ వెల్లడించింది.

ఏఐ సంబంధిత ఉద్యోగాలు 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు మధ్య 28 శాతం పెరగ్గా, ఉద్యోగ అన్వేషణలు 91 శాతం అధికం కావడం గమనార్హం. ఇక ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు సైతం 2018 జూన్‌ నుంచి 2019 జూన్‌ మధ్య 46 శాతం పెరగ్గా, 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య 51 శాతం వృద్ధి చెందాయి.

ఇదీ చూడండి: గూగుల్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు అదనపు వీక్‌ ఆఫ్‌

ABOUT THE AUTHOR

...view details