తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​ను భారతీయులు అడిగిన ప్రశ్నల్లో ఇవే టాప్​ - భారతీయులు

ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం కోసం గూగుల్​ తలుపు తట్టడం సర్వసాధారణం. ఎన్నో సందర్భాల్లో గూగుల్​కు కృతజ్ఞతలు కూడా చెప్పే ఉంటాం. మరి ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా సెర్చ్​ చేసిన విషయాలేంటో తెలుసా?

Article 370, Ayodhya case top India's 'What is?' list on Google this year
గూగుల్​ను భారతీయులు అడిగిన ప్రశ్నల్లో ఇవే టాప్​

By

Published : Dec 12, 2019, 5:31 AM IST

ఆర్టికల్​ 370 అంటే? అయోధ్య కేసు ఏంటీ? ఎన్​ఆర్​సీ అంటే ఏంటి? ఇవీ భారతీయులు ఈ ఏడాది గూగుల్​ను అడిగిన టాప్​-10 'వాట్​ ఈజ్​' ప్రశ్నల్లో కొన్ని. ఇటీవల విడుదలైన గూగుల్​ 2019 సెర్చ్​ రిపోర్ట్​ ఈ విషయాలను వెల్లడించింది.

ఆర్టికల్​ 370, సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​, బ్లాక్​ హోల్​, హౌడీ మోదీ వేడుకకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి భారత్​లోని నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబరిచినట్టు రిపోర్టు స్పష్టం చేసింది.

ఈ ఏడాది సెర్చ్​ చేసిన అంశాలను గతేడాది ఉన్న డేటాతో పోల్చి ఈ రిపోర్టును రూపొందించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది.

హౌ టు...?

హౌ టు(ఎలా)? అన్న భారతీయుల సెర్చ్​ను కూడా గూగుల్​ వెల్లడించింది. ఈ జాబితాలో సార్వత్రిక ఎన్నికల అంశం టాప్​లో నిలిచింది. ఓటు ఎలా వెయ్యాలి? ఓటర్​ జాబితాను ఎలా చూడాలి? వంటి ప్రశ్నలను భారతీయులు అధికంగా అన్వేషించారు.

భారతీయుల సెర్చ్​ ట్రెండ్​లో లోక్​సభ ఎన్నికలు రెండో స్థానంలో నిలిచాయి. మొదటి స్థానం క్రికెట్​ ప్రపంచకప్​దే.

చంద్రయాన్​-2, ఆర్టికల్​ 370, నీట్​ ఫలితాలు, పీఎం కిసాన్​ యోజన వంటి అంశాలపైనా భారతీయులు ఎక్కువగా శోధించారు.

సినిమా రంగాల్లో...

సినీ రంగంలో.. కబీర్​ సింగ్​, అవెంజర్స్​-ఎండ్​ గేమ్​, జోకర్​, కాప్టెన్​ మార్వెల్​ చిత్రాలు... సెర్చ్​ ట్రెండ్​లో టాప్​గా నిలిచాయి.

ప్రముఖుల్లో...

నెటిజన్లు విపరీతంగా శోధించిన ప్రముఖుల్లో రెండో స్థానం దిగ్గజ గాయని లతా మంగేష్కర్​, మూడో స్థానంలో క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఉన్నారు. తొలిస్థానం వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్థమాన్​కు దక్కింది.​

ABOUT THE AUTHOR

...view details