కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రజలు ఇంటర్నెట్ డేటాను మంచి నీళ్ల ప్రాయంగా వినియోగిస్తున్నారట. ఈ మేరకు డేటా సేవలు అందించే డీ-సిక్స్ అనే సంస్థ వెల్లడించింది.
వాటికే 80 శాతం డేటా..
వైరస్ ప్రభావంతో పలు సంస్థలు.. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాయి. అలానే జూమ్, స్కైప్, వెబెక్స్, మైక్రోసాఫ్ట్ వీడియోకాలింగ్ యాప్స్‌తో పాటుగా, అమెజాన్ ప్రైమ్, జీ5, నెట్‌ఫ్లిక్స్, వంటి వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్లకు ఆదరణ బాగా పెరిగిందని సర్వేలో తేలింది. కేవలం వీటికే దాదాపు 80శాతం డేటాను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.
ఫలితంగా జనవరి, ఫిబ్రవరితో పోల్చితే గత మూడు వారాల్లో 20 శాతం డేటా వినియోగం పెరిగిందని డీ-సిక్స్ సీఈఓ ఇవానోవ్ తెలిపారు.