తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌లు- 5 శాతం క్యాష్​బ్యాక్​ - latest business news

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్‌ ఐపాడ్‌లను ప్రీ-బుకింగ్​లో అందుబాటులో ఉంచింది రిలయన్స్ డిజిటల్. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్‌ వాచ్‌ల విక్రయాలు మొదలవుతాయి. ప్రముఖ బ్యాంకుల కార్డులతో ప్రీ-బుకింగ్‌ చేసుకుంటే 5శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

apple watches available in reliance digital with 5 percent dicount
రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌లు.. 5 శాతం క్యాష్‌బ్యాక్‌

By

Published : Sep 28, 2020, 10:49 AM IST

యాపిల్‌ వాచ్‌ల ప్రీ-బుకింగ్‌ సదుపాయాన్ని రిలయన్స్‌ డిజిటల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్‌ ఐపాడ్‌లను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. అంతేగాకుండా మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో వివరించింది.

వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్‌ వాచ్‌ల విక్రయం మొదలవుతాయి. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ ధర రూ.29,900 నుంచి.. సిరీస్‌ 6 యాపిల్‌ వాచ్‌ ధర రూ.40,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకూ రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రముఖ బ్యాంకుల కార్డులతో ప్రీ-బుకింగ్‌ చేసుకుంటే 5% క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని రిలయన్స్‌ డిజిటల్‌ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details