ఐఓఎస్ 15 పేరుతో కొత్త అప్‌డేట్‌ను యాపిల్ తీసుకురానుంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే యాపిల్ 2021 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఐఓఎస్ 14కి కొనసాగింపుగా వస్తున్న ఈ అప్డేట్లో సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనున్నారు. అయితే ఈ కొత్త అప్‌డేట్ కొన్ని మోడల్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుందట. ఐఫోన్ ఎస్‌ఈ2, ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
కేబుల్స్ కోసం..
దీనితో పాటు యాపిల్ కంపెనీ యూజర్స్ కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫోన్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే లైటెనింగ్ కేబుల్స్‌ని మరింత మందంగా తయారుచేయనున్నట్లు సమాచారం. దీని వల్ల కేబుల్స్ ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా కేబుల్ మడతబెట్టినప్పుడు పాడవకుండా ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐఫోన్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే కేబుల్స్ అడాప్టర్ వద్ద కానీ, ఫోన్‌కు కనెక్ట్ అయ్యే చోట కానీ త్వరగా విరిగిపోతున్నాయి. కొత్త కేబుల్ ధర ఎక్కువగా ఉండటం, ఫోన్‌తో పాటు వచ్చే కేబుల్ త్వరగా పాడవుతుండటం వల్ల యూజర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మరింత దృఢంగా కొత్త కేబుల్స్ తీసుకురావాలని యాపిల్ నిర్ణయించింది.