ఐఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 12 వచ్చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12 మినీని యాపిల్ మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి భారత్‌లో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కొత్త మోడల్ విడుదల తర్వాత కీలక ప్రకటన చేసింది యాపిల్ సంస్థ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 11 ఎంఆర్‌పీ ధరలను సవరించి.. కొత్త ధరల వివరాలను యాపిల్ ఇండియా తమ ఆన్‌లైన్ స్టోర్‌లో ఉంచింది. అయితే, ధర తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్లతో పాటు వచ్చే ఛార్జర్, ఇయర్‌పాడ్స్‌ను యాపిల్ తొలగించింది. ఇకపై ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే అందులో ఐఫోన్‌తో పాటు కేవలం ఛార్జింగ్ కోసం కేబుల్ కనెక్టర్ మాత్రమే ఇవ్వనున్నారు. ఐఫోన్ 12ను ఛార్జర్, ఇయర్‌పాడ్స్ లేకుండా అమ్మనున్నారు. దీంతో మిగతా మోడళ్లను అలాగే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది.
ధరలు ఇలా..