తెలంగాణ

telangana

ETV Bharat / business

2022లో యాపిల్‌ నుంచి 5జీ ఐఫోన్లే - 2022లో యాపిల్ ఫోన్లు

2022లో ఐఫోన్‌ ఎస్‌ఈతో పాటు 5జీ సాంకేతికతతో పనిచేసే ఐఫోన్‌లనే విడుదల చేసేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొత్తగా 4జీ మోడళ్లను ఈ సంస్థ విడుదల చేయకపోవచ్చని తెలుస్తోంది.

5g phones from apple
ఐఫోన్ 5జీ ఫోన్లు

By

Published : Jul 22, 2021, 8:30 AM IST

5జీ సాంకేతికతతో పనిచేసే ఐఫోన్‌లనే వచ్చే ఏడాది విడుదల చేసేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండేళ్ల క్రితం అందుబాటు ధరతో తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈతో పాటు 2022లో విడుదల చేసే అన్ని ఐఫోన్‌ మోడళ్లు కూడా 5జీతో పనిచేస్తాయి. 2022 నుంచి కొత్తగా 4జీ మోడళ్లను సంస్థ విడుదల చేయకపోవచ్చు.

అమ్మకాలు చాలా తక్కువగా ఉన్న ఐపోన్‌ మినీలో నవీకరించిన వెర్షన్‌ను సైతం కంపెనీ తీసుకురాకపోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తీసుకురాబోయే ఐఫోన్‌ ఎస్‌ఈ3లో యాపిల్‌ ఏ14 బయోనిక్‌ ఎస్‌ఓసీ ఫీచర్‌ ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. 2020 ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌లో ఏ13 బయోనిక్‌ ఉంది. కొత్త ఫీచర్‌ వల్ల ఈఫోన్‌ కూడా ఐఫోన్‌ 12 శ్రేజితో, ఐప్యాడ్‌ ఎయిర్‌తో సమాన సామర్థ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details