తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​లోకి యాపిల్‌ కొత్త వాచీలు.. ఐప్యాడ్​లు - యాపిల్ కొత్త వాచీలు

టెక్​ దిగ్గజం యాపిల్​ కొత్త ఉత్పత్తులను మార్కెట్​లోకి విడుదల చేసింది. వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, ఐప్యాడ్‌ ఎయిర్‌లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. మంగళవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది.

Apple is introducing a cheaper version of its smartwatch
మార్కెట్​లోకి యాపిల్‌ కొత్త వాచీలు.. ఐప్యాడ్​లు

By

Published : Sep 16, 2020, 8:07 AM IST

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఉత్పత్తులు వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, ఐప్యాడ్‌ ఎయిర్‌లను మంగళవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో విడుదల చేసింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితుల వల్ల కంపెనీ ఆన్‌లైన్‌లో వీటిని తీసుకొచ్చింది. ఈసారి యాపిల్‌ వాచ్‌, ఐప్యాడ్‌ కొత్త వెర్షన్‌లను మాత్రమే విడుదల చేసింది. ఎటువంటి ఐఫోన్లు, మ్యాక్‌లను తీసుకురాలేదు. యాపిల్‌ కొత్త తరం వాచ్‌ సిరీస్‌ 'వాచ్‌ 6'ను యాపిల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జఫె‌ విలియమ్స్‌ విడుదల చేశారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలియజేయడం దీని ప్రత్యేకత. ఈ సిరీస్‌ ప్రారంభ ధర 399 డాలర్లు. రక్తాన్ని పరీక్షించడానికి రెడ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌, ఆ తర్వాత ఆల్గారిథమ్స్‌ను వినియోగిస్తుంది.

మార్కెట్​లోకి యాపిల్‌ కొత్త వాచీలు.. ఐప్యాడ్​లు

ఐఫోన్‌ వాచ్‌ ఎస్‌ఈ

యాపిల్‌ చౌక ధర వాచ్‌ ఎస్‌ఈని తీసుకొచ్చింది. పెద్ద తెర, స్విమ్‌ ఫ్రూఫ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ వాచీ ప్రారంభ ధర 279 డాలర్లు. మూడేళ్ల కింద వచ్చిన వాచ్‌ సిరీస్‌ 3కి ఇది కొనసాగింపు అని కంపెనీ తెలిపింది. వాచ్‌ బాక్స్‌లో ఇకపై యూఎస్‌బీ అడాప్టర్‌లు ఉండవని స్పష్టం చేసింది.

యాపిల్​ కొత్త వాచీలు

ఐప్యాడ్‌

10.2 అంగుళాల తెర కలిగిన కొత్త తరం ఐప్యాడ్‌ను యాపిల్‌ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 329 డాలర్లు. ఏ12 బయోనిక్‌ చిప్‌, 10 గంటల ఛార్జింగ్‌, ఫేస్‌టైమ్‌ హెచ్‌డీ కెమేరా, 8 ఎంపీ కెమేరా, యాపిల్‌ పెన్సిల్‌ సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఐప్యాడ్‌ ప్రో మాదిరిగా ఉన్న కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను యాపిల్‌ ప్రదర్శించింది. దీని ప్రారంభ ధర 599 డాలర్లు.

యాపిల్​ ఐప్యాడ్​లు

ఇదీ చూడండి:టమాట ధరలకు రెక్కలు- కేజీ రూ.100

ABOUT THE AUTHOR

...view details