తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్- ఒక్కో ఉద్యోగికి రూ.75వేలు బోనస్! - apple bonus for employees

Work From Home: ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అవకాశాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది యాపిల్​ సంస్థ. దీంతో పాటు ప్రతి ఉద్యోగికి రూ.76,131 బోనస్​గా ఇస్తున్నట్లు పేర్కొంది.

workfromhome
యాపిల్​ వర్క్​ఫ్రమ్​ హోమ్

By

Published : Dec 16, 2021, 5:33 PM IST

Work From Home: కరోనా కారణంగా దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ​ఫ్రమ్ హోంను కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ దిగ్గజం యాపిల్​ తమ ఉద్యోగులకు మరింత కాలం వర్క్​ ఫ్రమ్​ హోమ్​ను కల్పించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్న తమ ఉద్యోగులకు రూ. 76,131 (వెయ్యి డాలర్లు) బోనస్​ను కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ ఉద్యోగులకు ఓ నోట్ పంపారు.

ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు ఎప్పుడు రావాలి అనే విషయంపై సంస్థ తన ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి నెల రోజుల ముందు ఉద్యోగులకు సమాచారం అందిస్తామని పేర్కొంది. ఒకవేళ ప్రారంభమైనా.. సోమవారం, మంగళవారం, గురువారం మాత్రమే ఆఫీస్​లో పనిచేయాల్సి ఉంటుంది. బుధ, శుక్రవారాల్లో వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇస్తుంది.

ఇదీ చూడండి :'అత్యధిక సంపద సృష్టి సంస్థగా రిలయన్స్​'

ABOUT THE AUTHOR

...view details