తెలంగాణ

telangana

ETV Bharat / business

అపాచీ ఆర్​ఆర్​310 రిలీజ్ మరింత ఆలస్యం - అపాచీ ఆర్​ఆర్​ 310 అప్​డేట్​

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్​ తన మోడల్​ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్​ఆర్​310 విడుదలను మరికొద్ది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో అనుకున్న విధంగా అయితే ఈ నెల 8న మార్కెట్​లోకి తీసుకురావాల్సి ఉంది. బైక్ నిర్మాణ శైలికి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేయడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

Apache RR310 launch will be late this is the reason!
అపాచీ ఆర్​ఆర్​310 మరింత ఆలస్యం..కారణం ఇదే!

By

Published : Apr 9, 2021, 5:44 PM IST

దేశీయ స్పోర్ట్స్​ బైక్​లలో మంచి ఆదరణ పొందుతున్న అపాచీ మోడల్స్​లో టాప్​ఎండ్​ బైక్​ను తీసుకురానుంది టీవీఎస్​ మోటార్. న్యూ టీవీఎస్​ అపాచీ ఆర్ఆర్​ 310 పేరుతో ఏప్రిల్ 8న ఈ కొత్త మోడల్​ మార్కెట్​లోకి రావాల్సి ఉండగా.. అది కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బైక్​ బాడీకి సంబంధించి మార్పులు చేయడమే ఇందుకు కారణం. బైక్​కు ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా హెడ్​ ల్యాంప్​ డిజైన్​ను కొంత మేర మారుస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ బైక్​ రంగుల్లోనూ మార్పు ఉంటుందని సమాచారం. పూర్తిస్థాయి సమాచారం తెలియాలి అంటే కంపెనీ నుంచి ప్రకటన రావాల్సిందే.

అపాచీ ఆర్​ఆర్​ 310 ధర రూ. 2.5 లక్షలు ఉండొచ్చని అంచనా.

ప్రత్యేకతలు..

  • లో స్పీడ్​ రైడింగ్​ కోసం గ్లైడ్​ త్రూ టెక్నాలజీ
  • డ్యూయల్​ ఛానెల్​ ఏబీఎస్​
  • 5 అంగుళాల కలర్ డిస్​ప్లే
  • సింగిల్​ సిలిండర్​ మోటార్​

ఇదీ చూడండి:కొత్త మోడళ్ల రాకతో ఈ నెల బైక్​ లవర్స్​కు పండగే!

ABOUT THE AUTHOR

...view details