మైక్రోవేవ్ సాంకేతికతపై పనిచేస్తున్న దేశీయ వైద్య ఎంఎస్‌ఎంఈ మాసర్ టెక్నాలజీ.. వస్తువులు, ఉపరితలాలు, పరిసరాలు, ఏరోసోల్స్‌లను క్రిమిరహితం చేసేందుకు అతుల్య అనే పరికరాన్ని తీసుకొచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీన్ని దేశవ్యాప్తంగా విపణిలోకి ప్రవేశపెట్టారు.
మాసర్ టెక్నాలజీ నుంచి వైరస్ నిర్మూలన పరికరం
వస్తువులు, ఉపరితలాలు, పరిసరాలు, ఏరోసోల్స్‌లను క్రిమిరహితం చేసేందుకు మాసర్ టెక్నాలజీ ఓ పరికరాన్ని తయారు చేసింది. దీన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విపణిలోకి ప్రవేశపెట్టారు. కరోనా వైరస్‌తోపాటు, ఇతర వైరస్‌లనూ ఇది సమర్థంగా నిర్మూలిస్తుందని సంస్థ తెలిపింది.
మాసర్ టెక్నాలజీ నుంచి వైరస్ నిర్మూలన పరికరం
కరోనా వైరస్‌తోపాటు, ఇతర వైరస్‌లనూ ఇది సమర్థంగా నిర్మూలిస్తుందని సంస్థ తెలిపింది. డీఆర్‌డీఓ డీమ్డ్ యూనివర్సిటీ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ పరికరాన్ని రూపొందించారు. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనన్స్ (ఎన్‌ఎంఆర్) సాంకేతికతతో 30 సెకన్ల నుంచి 1 నిమిషంలోపు ఇది స్టెరిలైజ్ చేస్తుంది.
ఇదీ చదవండి-'కారు'మేఘాలు తొలగుతున్నాయ్