తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌గా అనిల్‌ వల్లూరి - గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా

గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్​గా తెలుగువారైన అనిల్ వల్లూరి నియమితులయ్యారు. అనిల్​కు ఐటీ పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవముంది. ఇటీవల వరకు నెట్ యాప్ సంస్థలో ఇండియా- సార్క్ దేశాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

Anil Valluri is the Senior Director of Google Cloud India
గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌గా అనిల్‌ వల్లూరి

By

Published : Jun 9, 2020, 7:26 AM IST

Updated : Jun 9, 2020, 10:48 AM IST

గూగుల్‌ అనుబంధ సంస్థ అయిన గూగుల్‌ క్లౌడ్‌ ఇండియాలో సీనియర్‌ డైరెక్టర్‌గా తెలుగువాడైన అనిల్‌ వల్లూరి నియమితులయ్యారు. ఇటీవల వరకూ ఆయన 'నెట్‌యాప్‌' అనే సంస్థలో ఇండియా- సార్క్‌ దేశాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు ఆర్టిమన్‌ వెంచర్స్‌లో పనిచేశారు. సన్‌ మైక్రోసిస్టమ్స్‌ ఇండియా ఎండీగా వ్యవహరించారు. ఐటీ పరిశ్రమలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమలో క్లౌడ్‌- అతిపెద్ద మార్పు అని, ఈ విభాగంలో గూగుల్‌ విప్లవాత్మకమైన రీతిలో పనిచేస్తోందని' ఈ సందర్భంగా అనిల్‌ వల్లూరి పేర్కొన్నారు. క్లౌడ్‌ విభాగంలో దేశీయ సంస్థలకు సేవలు అందించటం లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు.

Last Updated : Jun 9, 2020, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details