ఇటీవల ఆన్లైన్ ప్రైవసీపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్‌ను ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా అప్డేట్ చేసింది. దీనితో ఏ ఇద్దరి మధ్య జరిగిన సందేశాలను ఇతరులెవ్వరూ చదవలేరు. నిజానికి ఈ ఫీచర్‌ను గత ఏడాది బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది ఆండ్రాయిడ్. తాజాగా దీనిని ఇతర యూజర్లు వినియోగించేలా అప్ డేట్ ఇచ్చింది.
''మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో మీరు సందేశాలు పంపించుకోవడం.. మరింత సురక్షితం. ఈ మెసేజ్లోని కంటెంట్.. పంపే మీకు, పంపాల్సినవారికి తప్ప ఎవరికీ కనిపించదని హామీ ఇస్తున్నాం.''
- ఆండ్రాయిడ్ అధికారిక వెబ్సైట్లో ప్రకటన
ఇద్దరి మధ్య సందేశాలు మూడో పార్టీ గానీ, గూగుల్ కానీ యాక్సెస్ చేయలేదు. ఎన్క్రిప్షన్ మోడ్‌ను యాక్టివ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. మొదటగా.. చాట్ ఫీచర్స్‌ను ఎనేబుల్ చేసుకుంటేనే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పనిచేస్తుంది. సెండ్ బటన్ వద్ద లాక్ ఐకాన్ కనిపిస్తే ఆ మెసేజ్ ఎన్క్రిప్టెడ్ అని అర్థం.