తెలంగాణ

telangana

ETV Bharat / business

'స్క్రీన్‌ చూడకుండా నిజ జీవితంలో ఉండాలనుకుంటున్నాను' - బిజినెస్​ న్యూస్​

ట్విట్టర్ ఖాతాలో వైరెటీ పోస్టులతో అలరించే ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra).. తాజాగా పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న తన పాత వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

anand mahindra
'స్క్రీన్‌ చూడకుండా నిజ జీవితంలో ఉండాలనుకుంటున్నాను'

By

Published : Sep 14, 2021, 8:21 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. కరోనా మహమ్మారి (Corona Pandemic) మన జీవితాల్ని ఎలా మార్చిందో అనే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆయన తరచూ తన ట్విట్టర్ ఖాతాలో వైరెటీ పోస్టులతో అలరిస్తుంటారనే విషయం తెలిసిందే. తాజాగా పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న తన పాత వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఈ వీడియోలో కొంతమంది పిల్లలు టీవీ స్క్రీన్ ముందు కూర్చొని క్రికెట్‌ చూస్తున్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపటికి ప్లేయర్‌ కొట్టిన బాల్‌ నేరుగా స్క్రీన్‌లోంచి వచ్చి పిల్లాడి చేతుల్లో పడుతోంది. స్క్రీన్‌నుంచి మరొక పిల్లాడు దగ్గరగా వచ్చి బాల్‌ ఇవ్వమని అడుగుతున్నట్లుగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే.. అది లైవ్‌ టెలికాస్ట్ వీడియో కాదు. ఓ డమ్మీ టీవీ స్క్రీన్ ముందు కూర్చొని స్థానికంగా ఆడుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ను పిల్లలు చూస్తుంటారు.

''కరోనా మహమ్మారి వల్ల మనం టీవీస్క్రీన్ ల ముందు ఎలా అతుక్కుపోయామో అనే విషయాన్ని ఈ వీడియో గుర్తు చేసింది. దాని నుంచి బయటికి వచ్చి నిజ జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను.'' అని ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: లాయర్ జేబులో పేలిన ఫోన్.. కోర్టులో విచారణ జరుగుతుండగా...

ABOUT THE AUTHOR

...view details