సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. తాజాగా.. రెండు సింహాలకు సంబంధించి ఓ ట్వీట్ షేర్ చేశారు. ఆయన చేసిన ఈ సందేశాత్మక ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. జంతువులు, మనిషి కలిసి జీవించే ప్రపంచం గురించి ఆయన ట్వీట్ చేశారు.
వీడియోలో..
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ట్వీట్లో.. ఓ వ్యక్తికి తలుపు తెరవగానే.. రెండు సింహాలు కనపడ్డాయి. అవి అక్కడే ఉన్న చిన్న తొట్టెలో నీళ్లు తాగుతూ కనపడ్డాయి. అవి ఆ వ్యక్తిని చూశాయి. కానీ దాడికి దిగలేదు. ఆ వ్యక్తి కూడా వాటిని పంపించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
అ వ్యక్తి చూసిన తర్వాత సింహాలు.. మళ్లీ నీరు తాగడం మీద దృష్టి పెట్టాయి. అలా దాహం తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి.