తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఐటీ విద్యార్థుల స్టార్టప్​లో ఆనంద్‌ మహీంద్రా పెట్టుబడి - హ్యాంప్​ర్యాంప్​ సంస్థ

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్​ మహీంద్రా ఓ స్టార్టప్​కు ఆర్థిక సాయం అందించారు. ఈ సంస్థలో 7.5 కోట్ల పెట్టుబడికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. గురుగ్రామ్​ ఆధారితంగా పనిచేసే ఈ హ్యాంప్​ర్యాంప్​ సంస్థ.. 'గో సోషల్'​ అనే సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ను తయారుచేస్తోంది.

Anand Mahindra funded 7.5 crore rupees to the Gurugram based startup Hapramp for their GoSocial platform
ఐఐటీ విద్యార్థుల స్టార్టప్​లో ఆనంద్‌ మహీంద్రా భారీ పెట్టుబడి

By

Published : Jun 11, 2020, 12:48 PM IST

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా గురుగ్రామ్​కు చెందిన హ్యాప్‌ర్యాంప్‌ అనే స్టార్టప్‌లో రూ.7.5 కోట్ల పెట్టుబడి పెట్టారు. బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతతోపాటు సోషల్‌ మీడియాపై ఈ అంకుర సంస్థ పనిచేస్తోంది. ఐదుగురు ఐఐటీ- వడోదర విద్యార్థులు దీన్ని 2018లో స్థాపించారు. రెండేళ్లుగా తాను ఓ స్టార్టప్‌ కోసం ఎదురుచూస్తున్నానని, ఎట్టకేలకు హ్యాప్‌ర్యాంప్‌ రూపంలో అది దొరికిందని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. వారి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం 'గో సోషల్‌'ను పరిచయం చేశారు.

ఆనంద్‌ మహీంద్రా పెట్టుబడి పెట్టడం పట్ల ఎంతో ఆనందంగానూ, గౌరవంగానూ ఉందని హ్యాప్‌ర్యాంప్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శుభేంద్ర విక్రమ్‌ పేర్కొన్నారు. ఈ నిధులతో తమ ప్లాట్‌ఫాంను మరింత విస్తరించనున్నామని తెలిపారు. తమ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం గో సోషల్‌ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 50 వేల మంది యూజర్లు ఉన్నారని, దాన్ని రాబోయే మూడు నెలల్లో లక్ష, ఏడాదిలో 10 లక్షల యూజర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తోందని, త్వరలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో కూడా అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 మంది ఉద్యోగులు ఉన్నారు.

దీ చూడండి: అద్భుత ఫీచర్లు, తక్కువ బడ్జెట్​లో 'ఎంఐ ల్యాప్​టాప్​'

ABOUT THE AUTHOR

...view details