సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పేద కూలీలకు కేవలం రూపాయికే 4 ఇడ్లీలు అందిస్తున్న ఆమె పనికి ముగ్ధులయ్యారు. ఆమె వ్యాపారానికి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు సన్నద్ధమయ్యారు.
కట్టెల పొయ్యి ఇంకానా?
ఎనభై ఏళ్ల వయస్సులోనూ కమలాత్తాళ్... కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు, బోండాలు చేస్తోంది. ఇది ఆమె ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఆమెకు తెలిసినవారు ఎవరైనా ఉంటే.. గ్యాస్ స్టవ్ కొనిస్తానని ప్రకటించారు.
మంచి పనికి... స్పందన