తెలంగాణ

telangana

ETV Bharat / business

చెన్నై-టోక్యో విమానసేవలు ప్రారంభించిన ఏఎన్​ఏ - 'ఆల్​ నిప్పాన్ ఎయిర్​వేస్​'

'ఆల్​ నిప్పాన్ ఎయిర్​వేస్​' మొదటిసారిగా చెన్నై నుంచి టోక్యోకు నేరుగా విమానసేవలు ప్రారంభించింది. దిల్లీ, ముంబయిల తరువాత దక్షిణ భారత నగరమైన చెన్నైలో ఈ సేవలు తీసుకొచ్చినట్లు తెలిపింది జపాన్​ దిగ్గజ విమానయాన సంస్థ.

చెన్నై-టోక్యో విమానసేవలు ప్రారంభించిన ఏఎన్​ఏ

By

Published : Oct 28, 2019, 6:15 AM IST

జపాన్​కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ 'ఆల్​ నిప్పాన్​ ఎయిర్​వేస్' (ఏఎన్​ఏ)​ చెన్నై నుంచి టోక్యోకు నేరుగా విమానసేవలను ప్రారంభించింది. దీనితో టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమానసేవలు అందిస్తున్న దక్షిణ భారత నగరంగా చెన్నై నిలిచింది.

"భారత్​ నుంచి టోక్యోకు విమాన సర్వీసులు నడుపుతున్న నగరాలు మూడు ఉన్నాయి. ఈ సేవలు కల్గిన మూడో నగరం చెన్నై. దక్షిణ భారతదేశంలో మొదటిది."-ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా

వారానికి మూడు సార్లు

చెన్నై-నరిటాకు వారానికి మూడు సార్లు ఏఎన్​ఏ విమానాలను నడుపుతుంది. టోక్యో నుంచిఆదివారం వచ్చిన మొదటి విమానం చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

దిల్లీ, ముంబయి తరువాత చెన్నై నుంచి విమానసేవలు ప్రారంభిస్తామని జనవరిలోనే ఏఎన్​ఏ ప్రకటించింది. ఫలితంగా భారత్​ నుంచి ఏఎన్​ఏ విమాన సర్వీసుల సంఖ్య 46కు చేరుకుంది.

బెంగళూరు, హైదరాబాద్​లకూ..

బెంగళూరు, హైదరాబాద్​ల్లోనూ విమానసేవలు ప్రారంభించే అవకాశం ఉందని ఏఎన్​ఏ జనరల్ మేనేజర్​ (ఇండియా) యసువో టాకి తెలిపారు. రాబోయే రోజుల్లో చెన్నై నుంచి మరిన్ని విమానాలు నడుపుతామని ఆయన చెప్పారు.

ఇదీ చూడండి:'మహా' పాలనపై శివసేన అధినేతతో అమిత్​షా భేటీ!

ABOUT THE AUTHOR

...view details