కొవిడ్ మహమ్మారి ప్రజల జీవితాల్లోనే కాదు ఆలోచన ధోరణిలోనూ మార్పులు తెస్తోంది. మహమ్మారి దృష్ట్యా ఆరోగ్యంగా ఉండటం, అనారోగ్యాన్ని తప్పించుకోవటంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిన ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు సంబంధించి వారి కలలు, లక్ష్యాలను కాపాడుకోవటం చాలా ముఖ్యమైనవిగా మారాయి.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలకు సరిపడా బీమా తీసుకోవటం ఉత్తమమని చాలా మంది అనుకుంటున్నారు. దీనివల్ల రక్షణ మాత్రమే కాకుండా వారి కోసం రాబడి కూడా సమకూరుతుంది. పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఇతర ఆర్థిక అవసరాలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బీమా తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడటమే కాకుండా జీవితంలో అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకుంటుందని నిపుణులు అంటున్నారు.
బీమా సంస్థను బట్టి పాలసీలు మారుతుంటాయి. ఆర్థిక పరిస్థితి, తమ అవసరానికి అనుగుణమైన వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పాలసీల గురించి తెలుసుకుందాం.
సింగిల్ ప్రీమియం బీమా పాలసీలు
ఈ పిల్లల పాలసీకి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీపై కొన్ని బీమా సంస్థలు డిస్కౌంట్లు కూడా అందిస్తుంటాయి. అదనపు ప్రయోజనాలను బట్టి బీమా పెరగటం, తగ్గటం జరుగుతుంది.
వాయిదా పద్ధతుల్లో ప్రీమియం చెల్లించే పాలసీలు