విమానయాన శాఖలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ నెల 15న దిల్లీలోని ఆఫీసుకొచ్చిన ఓ ఉద్యోగికి వైరస్ సోకినట్టు మంగళవారం నిర్ధరణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఉద్యోగిని కలిసిన సహచరులందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు.
"ఈ నెల 15న ఆఫీసుకొచ్చిన ఆ ఉగ్యోగికి వైరస్ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆఫీసు పరిసరాల్లో అన్ని నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారం. దిల్లీ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించింది. ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు చేపడుతోంది."
-- విమానయానశాఖ.