తెలంగాణ

telangana

ETV Bharat / business

పాల వ్యాపారంలో ఆమె టాప్- ఆదాయం రూ.88లక్షలు - అమూల్ బనాస్కాంఠా

తమ సంస్థకు పాలు విక్రయించడం ద్వారా లక్షల రూపాయలను సంపాదించిన గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల జాబితాను అమూల్ విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చౌధరీ నవల్బీన్ అనే 2,21,595.6 కిలోల పాలను విక్రయించి.., రూ.87,95,900లను సంపాదించినట్లు తెలిపింది.

Amul releases list of top 10 rural women entrepreneurs
పాలతో లక్షల వ్యాపారం- 'అమూల్' టాప్ 10 మహిళలు వీరే

By

Published : Aug 20, 2020, 7:46 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థకు అధిక పాలను విక్రయించిన 10 మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల జాబితాను అమూల్ ప్రకటించింది. వీరంతా గుజరాత్​లోని బనాస్​ డెయిరీకి భారీ ఎత్తున పాలు సరఫరా చేస్తున్నారు.

ఈ జాబితా ప్రకారం చౌధరీ నవల్బీన్ అనే మహిళ తొలి స్థానంలో ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,21,595.6 కిలోల పాలను విక్రయించి.., రూ.87,95,900లను సంపాదించారు.

'అమూల్' టాప్ 10 మహిళలు వీరే

మిగతా మహిళలంతా కలిసి లక్షలు విలువైన పాలను విక్రయించారని అమూల్ డెయిరీ ఛైర్మన్ ఆర్​ఎస్ సోదీ పేర్కొన్నారు. చాలా మంది మహిళలు పాడి, పశుసంరక్షణ రంగాన్ని తమ వృత్తిగా ఎంచుకుంటున్నారని తెలిపారు.

దక్షిణ గుజరాత్​లోని బనాస్​కాంఠా జిల్లాలో ఈ బనాస్ డెయిరీ ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

ఇదీ చదవండి-కరోనా విలయం: కేరళలో మళ్లీ విజృంభణ

ABOUT THE AUTHOR

...view details