తెలంగాణ

telangana

ETV Bharat / business

లెక్కల్లో చూపని బంగారానికి క్షమాభిక్ష పథకం! - Amnesty scheme for gold

ఇప్పటివరకు లెక్కల్లో చూపని బంగారాన్ని వెల్లడించి, కొంతమేర సుంకాలు చెల్లిస్తే, క్షమాభిక్ష ప్రకటించే పథకం ప్రతిపాదనను ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. పసిడి ధర పెరగటం, బంగారం వైపు పెట్టుబడులు మళ్లుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Amnesty scheme for unaccounted gold
లెక్కల్లో చూపని బంగారానికి క్షమాభిక్ష పథకం!

By

Published : Jul 31, 2020, 5:30 AM IST

దేశీయంగా వృథాగా ఉన్న పసిడి నిల్వలను నగదీకరించేందుకు ప్రకటించిన పథకాలు అంతగా ఫలించకపోవడంతో, మరో పథకాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. 'ఇప్పటివరకు లెక్కల్లో చూపని బంగారాన్ని వెల్లడించి, కొంతమేర సుంకాలు చెల్లిస్తే, క్షమాభిక్ష ప్రకటించే' పథకం ప్రతిపాదనను ఆర్థికశాఖ పరిశీలిస్తోందని తెలిసింది. ఈ ఏడాదిలోనే పసిడి ధర 30 శాతం పెరగడం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులు ఈ లోహంపైకి మళ్లుతుండటం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం. పెట్టుబడి గిరాకీకి అనుగుణంగా దిగుమతులు చేసుకుంటే, విదేశీ మారకపు ద్రవ్యాన్ని అధికంగా వెచ్చించాల్సి రావచ్చు. అందుకే పసిడి దిగుమతులను తగ్గించడం, ప్రజలకు ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలను పరిచయం చేసేందుకు ఆర్థికశాఖ సమాయత్తం అవుతోందని చెబుతున్నారు.

ఏం చేయాలనుకుంటున్నారు..

'ప్రజలు లెక్కల్లో చూపకుండా తమ దగ్గర ఉంచుకున్న బంగారాన్ని పన్ను అధికారులకు బహిర్గతం చేయాలి. వాటికి తగిన మేర సుంకాలు, జరిమానా చెల్లించి, చట్టబద్దం చేసుకోవచ్చు. అయితే ఇలా వెల్లడించిన బంగారంలో కొంతమేర ప్రభుత్వం వద్ద కొన్నేళ్ల కాలానికి డిపాజిట్‌ చేయాలి. ఇందువల్ల ఆ బంగారాన్ని చెలామణిలోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి వీలవుతుంది. ఫలితంగా దిగుమతులు తగ్గించవచ్చు' అనేది ప్రతిపాదన. దీనికి తుదిరూపు ఇచ్చాక, ఆమోదం కోసం ప్రధాని కార్యాలయానికి పంపుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:రిలయన్స్​: జూన్​ త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభం

ABOUT THE AUTHOR

...view details