గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్‌లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. కొవిడ్ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..
భారత్‌లో డాలర్ రూపేణ మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా.. 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద విలువ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)కు చేరింది.
- అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది.
- 2025 కల్లా భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.
- గతేడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షలు పెరిగి 5.61 కోట్లకు చేరింది. వీరి సంపద విలువ 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
- 2020లో సగటున భారత్‌లో ప్రతి యువకుడు/యువతి వద్ద 14,252 డాలర్ల సంపద ఉంది. ఇది 2000 నుంచి సగటున ఏటా 8.8% మేర పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.
- 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4320 మంది వరకు దేశంలో ఉన్నారు.
ముకేశ్ సంపాదన.. గంటకు రూ.90 కోట్లు