కరోనా కాలంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. ఆగస్టు 6, 7 తేదీల్లో సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
కరోనా వల్ల కొనేవాళ్లు లేక చిన్న వ్యాపారులు, చేతి వృత్తి కళాకారులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఈ సారి సేల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. చిన్న వ్యాపారుల నుంచి కొనే ఉత్పత్తులపై అదనపు డిస్కౌంట్లు కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఆఫర్లు, ఉత్పత్తులు..
ప్రైమ్ డే సేల్లో 300లకుపైగా కొత్త ఉత్పత్తులు విక్రయానికి రానున్నాయని అమెజాన్ తెలిపింది.