ఉద్యోగులు నిరవధికంగా ఇంటి నుంచే పనిచేయవచ్చని (Amazon Work From Home) ప్రకటించింది టెక్ దిగ్గజం ఆమెజాన్. కార్యాలయానికి రాకపోకలు సాగించే వీలు ఉన్నంతవరకు రిమోట్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ తన బ్లాగ్‌లో రాశారు. దీంతో వారానికి మూడు రోజుల పాటు అమెజాన్ ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుందనే ఊహాగానాలకు (Amazon Return to Office) తెరపడింది.
టీమ్స్‌ను ఇంటి నుంచి పనిచేసేందుకు (Amazon WFH News) అనుమతించే నిర్ణయాధికారం కంపెనీ డైరెక్టర్లదేనని జాస్సీ స్పష్టం చేశారు. "ఎక్కువ శాతం బృందాలు ఇంటి నుంచే పనిచేస్తాయని భావిస్తున్నాం. కొందరు.. ఆఫీస్, ఇల్లు కాంబినేషన్లో, మిగిలినవారు కస్టమర్ల కోసం పూర్తిగా ఆఫీస్‌లోనే పనిచేస్తారు." అని జాస్సీ తెలిపారు.