తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​ ఛార్జ్​ భారీగా పెంపు- సోమవారం నుంచే... - భారీగా పెరగనున్న ప్రైమ్​ మెంబర్​షిప్​ ఛార్జీలు

Amazon Prime Subscription Charges: అమెజాన్ ప్రైమ్​ వినియోగదారులకు బ్యాడ్​ న్యూస్​. నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఛార్జీలను ఈ నెల నుంచి పెంచేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్లను సవరిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

Amazon Prime subscription
అమెజాన్​ ప్రైమ్

By

Published : Dec 7, 2021, 1:50 PM IST

Amazon Prime Subscription Charges: అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు సంస్థ షాక్​ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్ననట్లు పేర్కొంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్‌ ధరలను కూడా సవరించనుంది. పెంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రైమ్‌ వీడియోలు, ప్రైమ్‌ మ్యూజిక్‌తోపాటు, ఉచిత హోమ్‌ డెలివరీ వంటి ప్రయోజనాలు అందుతున్నాయి. ఇందుకు ఏడాదికి రూ.999 అమెజాన్‌ వసూలు చేస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఓటీటీలకు ఈ మధ్య డిమాండ్‌ భారీగా పెరిగింది. దీనికి తోడు ఇ-కామర్స్‌ సంస్థల్లో కొనుగోళ్ల వైపు కూడా పెద్ద ఎత్తున వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను పెంచనున్నట్లు అమెజాన్‌ పేర్కొంది.

ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వార్షిక చందాను రూ.999 నుంచి రూ.1499కి పెంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. త్రైమాసిక చందా ప్రస్తుతం రూ.329 ఉండగా.. దాన్ని రూ.459కి పెంచనున్నట్లు పేర్కొంది. నెలవారీ ప్లాన్‌కు ప్రస్తుతం రూ.129 చెల్లిస్తుండగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. అయితే పెరిగిన ధరలు ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్​ను తీసుకున్న వారు.. కొత్తగా తీసుకోదలిచిన వారికి మరో వారం రోజులు మాత్రమే పాత ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

ఇదిలా ఉంటే త్వరలో పెరగనున్న మెంబర్​షిప్​ ఛార్జీలకు భిన్నంగా.. యూత్ మెంబర్‌షిప్ ప్లాన్‌లు మరింత తగ్గనున్నాయి. 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండే వారికి యూత్​ మెంబర్​షిప్​ పేరట ధరలను తగ్గించింది అమెజాన్​. వీరికి రూ.749 గా ఉన్న వార్షిక చందా.. కేవలం రూ. 499కే రానుంది. ఇదే కాకుండా నెలవారీ, త్రైమాసిక చందాలు.. రూ.89 నుంచి రూ.64కు, రూ.299 నుంచి రూ.164కి తగ్గనున్నాయి.

ఇదీ చూడండి:కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల మోత!

ABOUT THE AUTHOR

...view details