తెలంగాణ

telangana

ETV Bharat / business

Amazon Prime: అమెజాన్​ ప్రైమ్​ యూజర్లకు బ్యాడ్​ న్యూస్!

ప్రైమ్​ యూజర్లకు, కొత్తగా ప్రైమ్​ సేవల్ని పొందాలనుకుంటున్నవారికి అమెజాన్(Amazon Prime) షాకింగ్​ న్యూస్​. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon Prime Subscription) ధరలను ఏకంగా 50 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్​తో పాటు నెలవారీ, మూడు నెలల కాలానికి చెల్లించాల్సిన మెంబర్​షిప్​ ధరల కూడా ఈ మేరకు పెరగనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

amazon prime
అమెజాన్​ ప్రైమ్

By

Published : Oct 21, 2021, 1:20 PM IST

అమెజాన్​ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​​​ (Prime Annual subscription) ఇప్పుడు మరింత ప్రియం కానుంది. ప్రైమ్​ వీడియో వార్షిక సబ్​స్క్రిప్షన్​ ధరలు 50 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ప్రైమ్(Amazon Prime)​ సబ్​స్క్రిప్షన్​​​ తీసుకోవాలంటే రూ.999 చెల్లిస్తే సరిపోతుంది. అయితే త్వరలో ఈ మెంబర్‌షిప్‌కు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక ప్లాన్​లకు కూడా ధరల పెంపు వర్తించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నెలవారి మెంబర్​షిప్​కు(amazon prime subscription price) రూ.129 చెల్లించాల్సి ఉండగా.. త్వరలో రూ.179 కానుంది. అలాగే ప్రస్తుతం మూడు నెలల కాలానికి చెల్లించే రూ.329.. రూ.459కి పెరగనుంది. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయన్న స్పష్టత లేదు.

ప్లాన్​ ప్రస్తుత ధర కొత్త ధర(మారితే)
నెలవారీ రూ.129 రూ.179
మూడు నెలలకు రూ.329 రూ.459
వార్షిక ప్లాన్​ రూ.999 రూ.1499

భారత్​లో అమెజాన్ ప్రైమ్​ను​ ​(amazon prime membership) ప్రారంభించి ఐదేళ్లు అయిందని.. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అమెజాన్ చెబుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ముగిసిన తర్వాత కొత్త సబ్‌స్క్రిప్షన్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

టెలికామ్ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న కస్టమర్లకు కూడా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు(amazon prime membership) పెరగనున్నాయి.

ఇదీ చూడండి:Facebook Name Change: ఫేస్‌బుక్‌ పేరు మారనుందా..?

ABOUT THE AUTHOR

...view details