తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ సారి 'అమెజాన్ ప్రైమ్ డే సేల్' లేనట్లే?

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 'అమెజాన్ ప్రైమ్ డే సేల్​'ను తాత్కాలికంగా వాయిదా వేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్​ తిరిగి జులైలో మొదలవనుంది.

Amazon
అమెజాన్

By

Published : May 9, 2021, 5:42 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో' అమెజాన్ ప్రైమ్ డే​' పేరిట నిర్వహిస్తున్న ఆఫర్​​ సేల్స్​ని నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్​ తిరిగి జులైలో మొదలవ్వనున్నట్లు తెలిపింది.

తన ప్లాట్​ఫాంపై షాపింగ్ చేసే చందాదారులకు మరింత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ టూల్​ను వినియోగిస్తుంది అమెజాన్​. ఫాస్ట్-షిప్పింగ్​తో పాటు.. అమెజాన్ ప్రైమ్‌ను సబ్​స్క్రైబ్​ చేసుకునే వారికి డిస్కౌంట్‌లు ఇస్తుంటుంది.

రియల్​మీ సైతం..

మరోవైపు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నూతన మోడళ్ల లాంచింగ్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ ప్రకటించింది. కరోనా విజృంభణ వల్ల నూతన మోడళ్ల లాంచింగ్​లు, వార్షికోత్సవ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ ట్వీట్‌ చేశారు. 'ఇంట్లోనే సురక్షితంగా, ధైర్యంగా ఉండండి.. త్వరలోనే తిరిగి వస్తాం' అని తెలిపారు.

ఇవీ చదవండి:అమెజాన్​ ఫ్రీ గిఫ్ట్​.. లింక్​ క్లిక్​ చేస్తే అంతే!

అమెజాన్ 3 నెలల ఆదాయం రూ.8 లక్షల కోట్లు!

ABOUT THE AUTHOR

...view details