తెలంగాణ

telangana

ETV Bharat / business

Amazon sale: అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌ ఎప్పుడంటే? - అమెజాన్‌ ఇండియా వార్తలు

అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' తేదీలను విడుదల చేసింది. భారత్​తో పాటు.. గ్లోబల్ బ్రాండ్ల ఉత్పత్తులపై అపరిమిత ఆఫర్లను అందుబాటులో ఉంచనుంది.

AMAZON PRIMEDAY SALE
అమెజాన్​, amazon, primeday sale, ప్రైమ్​ డే సేల్​

By

Published : Jul 8, 2021, 9:22 PM IST

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే 'ప్రైమ్‌ డే సేల్‌' పేరిట ఈ నెల 26, 27 తేదీల్లో సేల్‌ నిర్వహించనుంది. వాస్తవానికి జూన్‌లో ఇది జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. అలాగే కొవిడ్‌ కారణంగా ఘోరంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు ఈ సేల్‌ నిర్వహిస్తున్నట్లు అమెజాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి. కొత్తగా 300 ఉత్పత్తులను లాంచ్‌ చేయనున్నారు. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది.

అమెజాన్‌ పేతో కొనుగోలుపై రూ.1000, అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై ఐదు శాతం వరకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. అయితే.. ఏయే వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్‌ లభిస్తుంది? కొత్తగా లాంచ్‌ చేయబోయే వస్తువులేంటి? వంటి వివరాలు తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details