ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వార్షిక 'ప్రైమ్ డే సేల్'లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి 'అడ్వాంటేజ్- జస్ట్ ఫర్ ప్రైమ్' పేరిట ప్రైమ్ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి.
- ఐక్యూ జెడ్3 5జీ ఫోన్‌పై సుమారు రూ.1,500 కూపన్ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.17,000లకు రానుంది.
- షియోమీ ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్ఫోను ఎక్సేంజ్ ఆఫర్ రూ.3000 తగ్గింపుతో రూ. 20 వేల లోపు రానుంది.
- వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ ఫోన్‌పై వేయి రూపాయిల అడిషినల్ డిస్కౌంట్ లభించనుంది. అంతేగాకుండా ప్రైమ్‌డే నాడు ఈ ఫోన్ సూమారుగా రూ. 30వేలకు రానుంది.
- వన్‌ప్లస్ 9ఆర్ 5జీ ఫోన్‌పై వినియోగదారులకు కూపన్స్పై నాలుగు వేల రూపాయిలు ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో 5వేల రూపాయిలు తగ్గనున్నాయి.
- వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 5జీ మొబైల్ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిస్కౌంట్ కింద వేయి రూపాయిలు ఆఫర్ లభించనుంది. అంతేకాకుండా జియో వినియోగదారులు సుమారు రూ. 6వేల వరకు లబ్ధిపొందనున్నారు.
- రెడ్మీ నోట్ 10టీ 5జీ ఫోన్ ప్రైమ్‌డే నాడు రూ.13,999లకు లభించనుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీపై సుమారు రూ. 10వేల వరకూ కూపన్ ఆఫర్స్ పొందగలుగుతారు.