తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​కు పోటీగా.. ఫ్లిప్​కార్ట్​ ఒక్కరోజు ముందే - అమెజాన్ వార్షిక ప్రైమ్ డే ఆఫర్లు 2021

మరోసారి ఆన్​లైన్ షాపింగ్ పండుగకు తెరలేచింది. బంపర్​ల బొనాంజా మోగనుంది. జులై 25 నుంచి ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్.. జులై 26 నుంచి అమెజాన్ 'వార్షిక ప్రైమ్ డే' ప్రారంభం కానున్నాయి.

Flipkart  amazon
ఫ్లిప్​కార్ట్ అమెజాన్

By

Published : Jul 21, 2021, 11:30 AM IST

దిగ్గజ ఈ-కామర్స్ వెబ్​సైట్లు అమెజాన్, ఫ్లిప్​కార్ట్ అదిరిపోయే డీల్స్​తో ముందుకొచ్చాయి. తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను అందించే 'బిగ్​ షాపింగ్' తేదీలను ప్రకటించాయి. జులై 26,27 తేదీల్లో 'వార్షిక ప్రైమ్ డే'ను నిర్వహించనుంది అమెజాన్​. మరోవైపు దీనికి పోటీగా ఒక్కరోజు ముందుగానే 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్' జులై 25న మొదలై 29 వరకు కొనసాగనుంది. ఈ సేల్స్​లో స్మార్ట్​ఫోన్లు, గృహోపకరణాలతో పాటు పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​..

  • బంపర్ ఆఫర్..

స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లపై 75 శాతం వరకు.. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు, ట్రిమ్మర్‌లపై బెస్ట్ డీల్స్​తో పాటు.. 80 శాతం వరకు తగ్గింపు ఉండనుంది.

  • 'స్మార్ట్‌' తగ్గింపు..

మోటో జీ-40 ఫ్యూజన్, మోటో జీ-60, వివో వి-215జీ, పోకో ఎక్స్-3 ప్రో వంటి మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఇదే ఈవెంట్​లో పోకో ఎఫ్ 3 జీటీ గ్రాండ్ లాంచ్‌ అవ్వనుంది.

  • ఐఫోన్‌లపైనా..

ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్‌ఈ (2020), ఐఫోన్ 12 మినీలపై గణనీయమైన తగ్గింపులను అందించనుంది.

అమెజాన్ ప్రైమ్​ డే సేల్..

ఈ సేల్‌లో కొత్తగా 300 ఉత్పత్తులను లాంచ్‌ చేయనుంది అమెజాన్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్​ను ఇవ్వనుంది. కొవిడ్‌ కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు ఈ సేల్‌ నిర్వహిస్తున్నట్లు అమెజాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి అమెజాన్ 'ఈ సేల్‌' జూన్‌లోనే జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆలస్యమైంది.

మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details