తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్‌ పే నష్టం రూ.1868 కోట్లు - అమెజాన్ పే ఇండియా గత ఆర్థిక ఏడాది నష్టాలు

ప్రముఖ ఇ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ చెల్లింపుల విభాగం అమెజాన్​ పే గతేడాది భారీ నష్టాన్ని చవిచూసినట్టు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,865 కోట్లు నికరంగా నష్టపోయినట్టు తెలిపింది.

AMAZON PAY LOSS OF RS.1868 CRORES
అమెజాన్‌ పే నష్టం రూ.1868 కోట్లు

By

Published : Dec 12, 2020, 10:54 AM IST

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు చెందిన చెల్లింపుల విభాగం అమెజాన్‌ పే(ఇండియా) గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ.1,868.5 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2018-19లో సంస్థ నష్టం రూ.1,160.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.834.5 కోట్ల నుంచి 64 శాతానికి పైగా పెరిగి రూ.1,370 కోట్లకు చేరింది.

పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి సంస్థలతో పోటీపడుతున్న అమెజాన్‌ పేలోకి గత ఆర్థిక ఏడాది అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్‌, అమెజాన్‌ డాట్‌ కామ్‌ల నుంచి రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సంస్థలకు అమెజాన్‌ పే జూన్‌లో రూ.450 కోట్లు, అక్టోబరులో రూ.900 కోట్లు, 2019 డిసెంబరులో రూ.1355 కోట్ల మేర షేర్లను కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో మరో రూ.700 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది.

ఇదీ చదవండి:అమెజాన్​లో.. అడవి ఆడబిడ్డల ఉత్పత్తులు

ABOUT THE AUTHOR

...view details