ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారత్‌లో వాహన బీమా రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం వాహన బీమా పాలసీలు అందించేందుకు ఆకో జనరల్ ఇన్సూరెన్స్‌తో అమెజాన్ పే చేతులు కలిపింది.
ప్రైమ్ సభ్యులకు రాయితీ..
వినియోగదారులు బీమా పథకాలను సులభంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్ పే సహకారం అందించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు రాయితీల వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అమెజాన్ పే పేజ్, అమెజాన్ యాప్ లేదా మొబైల్ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు వాహన బీమా తీసుకోవచ్చు. పేరు, చిరునామా లాంటి ప్రాథమిక వివరాలు అందించడం ద్వారా కారు లేదా బైకుకు ఎంత బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందనే వివరాలను వాళ్లు తెలుసుకోవచ్చు.