తెలంగాణ

telangana

ETV Bharat / business

Apple Days Sale: తక్కువ ధరకే ఐఫోన్లు- లిమిటెడ్​ ఆఫర్​! - అమెజాన్ యాపిల్​ డే సేల్​ పూర్తి వివరాలు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ​ యాపిల్ డేస్​ సేల్​ ప్రారంభించింది. ఐఫోన్లపై గరిష్ఠంగా రూ.27 వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్​లో ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఎంత? ఎప్పటి వరకు ఈ సేల్ కొనసాగుతుంది? అనే వివరాలు మీ కోసం.

Discounts on iPhones in Amazon
అమెజాన్​లో ఐఫోన్లపై భారీ తగ్గింపు

By

Published : Jul 13, 2021, 11:50 AM IST

యాపిల్​ ఐఫోన్​ కొనాలుకునే వారికి ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ గుడ్​ న్యూస్ చెప్పింది. యాపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 12 సహా ఐఫోన్​ 11, ఇతర మోడళ్లను భారీ డిస్కౌంట్​తో విక్రయిస్తున్నట్లు తెలిపింది. యాపిల్​ డేస్​ పేరుతో సోమవారం ప్రారంభమైన ఈ సేల్​ జులై 17 వరకు కొనసాగనుంది.

  • ఈ సేల్​లో ఐఫోన్ 12 (64జీబీ) మోడల్​ను రూ.9 వేల డిస్కౌంట్​తో రూ.70,900కే పొందే వీలుంది. దీనితో పాటు హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డ్​ ద్వారా చెల్లింపులు జరిపే వారికి అదనంగా రూ.6,000 డిస్కౌంట్ లభించనుంది.
  • యాపిల్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్​ (256 జీబీ) మోడల్​ను రూ.96,900లకు పొందొచ్చని అమెజాన్​ తెలిపింది. ఈ మోడల్ అసలు ధర రూ.1,23,900గా ఉంది.
  • వీటితో పాటు.. ఐఫోన్ 6ఎస్​, ఐఫోన్ 8 ప్లస్​, ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్​ ఎక్స్​ఆర్​ వంటి మోడళ్లపైనా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్​.
  • ఐఫోన్​తో పాటు.. యాపిల్ మ్యాక్​బుక్​ ప్రోపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్​. 13.3 అంగుళాల డిస్​ప్లే ఉన్న యాపిల్​ మ్యాక్​ బుక్​ ప్రో డిస్కౌంట్​ ధర ను రూ.99,990గా ఉంచింది. దీని అసలు ధర రూ.1,17,900గా ఉంది.
  • మ్యాక్​ బుక్​, మ్యాక్​ బుక్​ ఎయిర్​ వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను డిస్కౌంట్​లో విక్రయిస్తున్నట్లు తెలిపింది అమెజాన్​. యాపిల్ ఉత్పత్తులన్నింటిపై ఎక్స్చేంజ్​ బోనస్​ పొందొచ్చని.. నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు ఉన్నట్లు వివరించింది.

ఈ నెలలోనే ప్రైమ్​ డే సేల్​..

ఈ నెలలోనే 'అమెజాన్​ ప్రైమ్ డే సేల్​' ఉండనుంది. ఈ సేల్​లో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. కొవిడ్‌ కారణంగా ఘోరంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు గాను.. ఈ నెల 26, 27 తేదీల్లో ప్రైమ్​ డేస్​ సేల్​ నిర్వహిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది.

ఇదీ చదవండి:వారి ఆస్తులు పంచేస్తే పేదరికం పోతుందా?

ABOUT THE AUTHOR

...view details